Please enable JavaScript.
Coggle requires JavaScript to display documents.
స్వామి వివేకానంద - Coggle Diagram
స్వామి వివేకానంద
అమెరికా పర్యటన
నరేంద్రుడు అమెరికాలోని చికాగో లో జరగబోయే సర్వమత మహా సభలకు వెళ్లాలని, అక్కడ భారతదేశ గొప్పతన్నాని, ఆధ్యాత్మికను చాటి చెప్పాలనుకున్నారు.
అయితే విదేశాలకు వెళ్ళడానికి కావలసిన డబ్బును కొంతమంది యువకులు సమకూర్చారు. ఖేత్రి మహారాజు కెనడా వెళ్ళే ఓడలో టికెట్టును కొని నరేంద్రునికి ఇచ్చారు. అలాగే “వివేకానంద” అనే పేరును కూడా స్వీకరింపమన్నాడు.
.
రైలులో ప్రయాణిస్తుండగా “సాన్ బోర్న్” అనే మహిళ పరిచయం అయింది. ఆమె బోస్టన్ నగరానికి వచ్చినపుడు తమ ఇంటికి రమ్మని ఆహ్వానించింది.
అయితే సర్వ మత మహా సభలు 3 నెలలకు వాయిదా పడ్డాయని అక్కడకి వెళ్ళాక తెలిసింది. ఆయన బోస్టన్ నగరంలో ఉండే “సాన్ బోర్న్”అనే మహిళ ఇంట్లో కొన్ని రోజుల పాటు ఉన్నారు.
బోస్టన్ లో ఉంటున్న సమయంలో స్వామిజి కి J.H Right అనే ఒక ప్రొఫసర్ తో పరిచయం ఏర్పడింది స్వామిజికి ఆ ప్రొఫెసర్ విశ్వమత మహా సభల్లో మాట్లాడానికి తనకి అనుమతి పత్రం ఇప్పించారు
ఆ ఉత్తరంలో ఈ అమెరికాలోని పండితులను మేధావులను, అందరినీ ఒక వైపు కూర్చోపెట్టి ఈ వివేకానందను ఒకవైపు కుర్చోపెట్టినా కూడా ఈ స్వామిజి మేధస్సుకు, స్థాయికి వాళ్ళు సరిపోరని పేర్కొన్నారు.
అలా సర్వ మత మహా సభలు 1893 సంవత్సరం సెప్టెంబర్ 11 న తేదీన ప్రారంభమయ్యాయి. సభలో ఒక్కొక్కరుగా లేచి వాళ్ళ మతాల గొప్పతనం గురించి మాట్లాడారు.
చివరగా స్వామి వివేకానంద నిల్చుని గంభీరమైన గొంతుతో “Sisters and brothers of America ” “అమెరికా దేశపు సోదర సోదరీమణులారా” అని పలకరించే సరికి ఆ ఒక్క పిలుపికి సభలో ఉన్న 4000 మందికి పైగా జనం లేచి 2 నిమిషాల పాటు ఆగకుండా చప్పట్లు కొట్టరు.
ఆ చప్పట్ల శబ్దం ఆగిన తరువాత ఆయన భారతదేశ గొప్పతనం గురించి మన దేశంలో ఆధ్యాత్మికత, సనాతన దర్మం, సంసృతి, సంప్రదాయాల గురించి ప్రసంగించారు.
-
అలా 1893 వ సంవత్సరం మే 31వ తేదీన బొంబాయి తీరం నుండి ఒక నౌక లో ఆయన బయలుదేరారు. జులై నెలలో ఆయన రైలులో చికాగో చేరుకున్నారు
బాల్యం:
-
పశ్చిమబెంగాల్లోని కోల్కతాలో 1863 జనవరి 12న విశ్వనాథ్ దత్తా, భువనేశ్వరి దంపతులకు జన్మించాడు.
ఏకసంథాగ్రాహిగా పేరు తెచ్చుకున్న వివేకానంద జ్ఞాపకశక్తి అమోఘమైనది. బాల్యం నుంచే ఆటలలోనూ, చదువులోనూ చురుగ్గా ఉండేవాడు..
-
ఇంటిలోనే ఒక వ్యాయామ శాల ఏర్పాటు చేసుకున్నాడు. కర్ర సాము, కత్తిసాము గుర్రపుస్వారీ నేర్చాడు.
1880 వరకు మెట్రిక్యులేషన్ పరీక్ష ఉత్తీర్ణుడై.. ఆ తర్వాత తత్వశాస్త్రం,పాశ్చాత్య శాస్త్రాలను అభ్యసించాడు.
తండ్రి గారికి బదిలీ కావడంతో, రాయపూర్ వెళ్ళి తిరిగి కలకత్తా వచ్చి మూడేళ్ళ చదువును ఒక్క సంవత్సరంలోనే పూర్తి చేశాడు. ఆ పరీక్ష మొదటి శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. తరువాత ప్రెసిడెన్సీ కాలేజీలోను, మరుసటి సంవత్సరం నేడు స్కాటిష్ అని పిలువబడే కళాశాలలోనూ చేరాడు.
-
బోధనల సారాంశం
దేశానికి ఏది మంచిదో అదే మనకు హితము కావాలి. భారత దేశానికి మంచి జరగాలంటే స్త్రీ జనోద్ధరణ, జన చైతన్యం ప్రధానంగా సంభవించాలి.
పేద జనానికి ఆహారం ఇవ్వాలి. జీవనోపాధి అవకాశాలు కల్పించాలి. విద్యా వ్యాప్తి సక్రమంగా జరగాలి. వ్యావహారిక భాషలోనే కళాత్మకంగా, సహజంగా శాస్త్ర పాండిత్యం సాధించాలి.
పరిశోధనలను కూడా వాడుక భాషలో నిర్వహించాలి. విద్య సమస్త సమస్యలను పరిష్కరించే మార్గం కావాలి.” అని జాతికి సందేశం ఇచ్చాడు.
వివేకానంద యువకులకు “ఇనుప కండరాలు,ఉక్కు నరాలు,వజ్ర సంకల్పం ఉన్న యువత ఈ దేశానికి అవసరం.
వివేకానంద “మన భారత దేశం పుణ్యభూమి. సంపద, అధికారం మన భారత జాతికి ఎప్పుడు ఆదర్శాలు కాలేదు. భారతీయుడు ఎవరైనా సరే జాతిమాట తారతమ్యం లేకుండా పేద, గొప్ప వివాదం లేకుండా కుల వివక్షతను దగ్గరకు రానియకుండా అందరూ సహోదారులుగా మెలగాలి.
లేవండి..మేల్కోండి.. గమ్యం చేరేవరకు విశ్రమించకండి. పిరికితనాన్ని విడిచి, ధైర్యంగా సమస్యలను ఎదుర్కోండి.
దీనజనులను ఉద్ధరించండి. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. ఓర్పుతో పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.” అని సందేశం ఇచ్చారు.
-